: నేడు కృష్ణానదిలోకి ప్రవేశించనున్న గోదావరి జలాలు... పూజా కార్యక్రమానికి చంద్రబాబు హాజరు!


ఏపీలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు కృష్ణానదిలో ఈరోజు కలవనున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో గోదావరి జలాలు పవిత్ర సంగమం కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించనున్న పూజా కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. కాగా, ఈ నెల 6 వతేదీన పట్టిసీమ పంపులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రారంభించిన విషయం తెలిసిందే. జలవనరుల శాఖ ఇంజనీర్ల లెక్కల ప్రకారం ఈ నెల 10వ తేదీ నాటికే ప్రకాశం బ్యారేజీకి నీరు చేరాల్సి ఉంది. కానీ, నాలుగు పంపులే పనిచేస్తుండటంతో గోదావరి జలాలు పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులు దాటేందుకు సమయం పట్టింది. నిన్నటికి కృష్ణా జిల్లా సరిహద్దులకు గోదావరి జలాలు చేరాయి. వారం రోజుల తర్వాత పట్టిసీమ 24 పంపులు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, దాదాపు 8,500 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి చేరనుందని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News