: కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో మీ వాటానే ఎక్కువటగా!.. కాపులకు షాకిచ్చిన జస్టిస్ మంజునాథ!


ఏపీలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండే ప్రస్తుతం హాట్ టాపిక్. ఇదే డిమాండ్ తో కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వరుస దీక్షలు చేపట్టి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడ్డ టీడీపీ సర్కారు... కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై అధ్యయనం కోసం జస్టిస్ మంజునాథ అధ్యక్షతన బీసీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పని ప్రారంభించిన కమిషన్ ను కలిసేందుకు నిన్న విజయవాడ వెళ్లిన అఖిల భారత కాపు సంఘం నేతలు... కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయను వెంటబెట్టుకుని జస్టిస్ మంజునాథతో భేటీ అయ్యారు. తమకు రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చాలని వారు ఆయనకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ చేసిన వ్యాఖ్యలతో కాపు నేతలకు నోట మాట రాలేదట. ‘‘కాపుల్లో ఐదు శాతమే ఉన్నతంగా ఉన్నారని మీరు చెబుతున్నారు. కానీ కొన్ని సంఘాలు కాపుల్లో 95 శాతం అభివృద్ధి చెందారని చెబుతున్నాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కాపులే అధికంగా ఉన్నారని కూడా ఆ సంఘాలు చెబుతున్నాయి’’ అని ఆయన చేసిన వ్యాఖ్యలతో కాపు నేతలు షాక్ తిన్నారట.

  • Loading...

More Telugu News