: రమ్య మృతి కేసు... ఐదుగురు విద్యార్థులపై చర్యలకు కళాశాలకు పోలీసుల నోటీసులు
చిన్నారి రమ్య మృతి కేసులో నిందితుడు శ్రావెల్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సంఘటన జరిగిన రోజున కారులో ఉన్న మిగిలిన ఐదుగురు విద్యార్థులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నారాయణ గూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈ మేరకు బంజారా హిల్స్ పోలీసులు నోటీసులు పంపారు. కళాశాలకని వచ్చిన విద్యార్థులు ఎక్కడికి వెళుతున్నారు? ఏమి చేస్తున్నారనే విషయాలపై కాలేజీ యాజమాన్యం ఆరా తీయకపోవడాన్ని పోలీసులు ప్రశ్నించారు. ఈ సంఘటన జరిగిన రోజున నిందిత విద్యార్థులు కాలేజీకి వచ్చారా? లేదా? అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.