: క్షేమంగా చేరుకున్న అమర్ నాథ్ యాత్రికులు... మంత్రి సునీత పరామర్శ!


అమర్ నాథ్ యాత్రకు వెళ్లి శ్రీనగర్ లో కర్ఫ్యూ కారణంగా నానా ఇబ్బందులు పడి తిరిగి క్షేమంగా చేరుకున్న అనంతపురం యాత్రికులను ఏపీ మంత్రి పరిటాల సునీత పరామర్శించారు. యాత్రలో వారి పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. తాము యాత్రకు వెళ్లి ఇరుక్కుపోవడంతో క్షణక్షణం భయపడుతూ బతికామని, దీంతో పాటు కుటుంబసభ్యులు గుర్తుకు రావడంతో మరింత నరకం అనుభవించామని సురక్షితంగా తిరిగొచ్చిన యాత్రికులు తనకు చెప్పారని మంత్రి అన్నారు. అయితే, అక్కడి మిలిటరీ అందించిన సేవలు మరువలేనివని చెప్పారన్నారు. ఈ సందర్భంగా మిలిటరీ వారికి తన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై అమర్ నాథ్ యాత్రకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయా ఎమ్మార్వో, కలెక్టరేట్ కార్యాలయాల్లో తమ పేర్లను రిజిస్టర్ చేయించుకుని వెళ్లాలని సునీత సూచించారు.

  • Loading...

More Telugu News