: ప్రభుత్వ భూముల్లో బినామీలకు పట్టాలిచ్చారు... సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే అనిత
గత పాలకులు విశాఖపట్టణంలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో తమ బినామీలకు పట్టాలిచ్చారని టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆరోపించారు. 2011లో అసైన్ మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్న గొల్ల బాబురావు 179 మందికి డి-పట్టాలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, అందులో 169 మంది బినామీలేనని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేస్తూ సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి, కలెక్టర్, సీసీఎల్ కు లేఖలు రాయనున్నట్లు అనిత చెప్పారు.