: నీట్ ఆర్డినెన్స్ పై స్టేకు సుప్రీం నిరాకరణ... ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో చెప్పమంటూ కేంద్రానికి నోటీస్


నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్టు (నీట్)పై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. అసలు ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నీట్ పై సుప్రీం తీర్పును నిలుపుదల చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదని పేర్కొంది. అదే సమయంలో ఆర్డినెన్స్‌ పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది. కేందం తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆర్డినెన్స్ నిలుపుదలకు అంగీకరించలేదు. విద్యార్థులకు నష్టం కలుగకూడదు కనుక పిటిషనర్ తో ఏకీభవించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News