: టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డ కోదండరామ్


తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడు, జాయింట్ యాక్షన్ కమిటీ నేత ప్రొఫెసర్ కోదండరామ్, మరోసారి కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో పెరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఆగస్టులో సదస్సును నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏ ప్రభుత్వమైనా చట్ట ప్రకారం పనిచేయాల్సి వుందని, తెలంగాణలో చట్టాన్ని మీరుతూ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. తుమ్మిడిహట్టి ముంపు ప్రాంతాన్ని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, మల్లన్న సాగర్ విషయంలోనూ అదే విధానాన్ని అమలు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News