: పెగ్గు మీద పెగ్గేసి సీఎం పరువును గంగలో కలిపిన బీహార్ నేత!


బీహార్ లోని అధికార జనతాదళ్ (యు) పార్టీ నేత లలన్ రామ్. మాజీ ఎమ్మెల్యే కూడా. రాష్ట్రంలో మద్య నిషేధం అమలవుతున్న వేళ, పూటుగా మందు కొడుతూ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరువును గంగలో కలిపాడు. షార్టు, బనీన్ వేసుకుని కుర్చీలో కూర్చుని, ఎదురుగా బీర్లు, ఓడ్కా పెట్టుకుని లాగిస్తూ, ఈయన అన్న మాటలు వీడియో రూపంలో వెలుగులోకి వచ్చాయి. తనకు ఎదురులేదని, సీఎం నితీశ్ పక్కన ఉన్నంత వరకూ తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, తనకేమీ కాదని చెప్పారు. సీఎంతో తనకున్న బంధాన్ని ఏకరువు పెట్టి పరువు తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కడంతో, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు, మద్య నిషేధ ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలపై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన గురించి మాట్లాడి పార్టీకి నష్టం కలిగించినందుకు లలన్ ను బహిష్కరించాలని నితీశ్ కుమార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News