: అర్హత లేని కుమార్తెకు పదవి కట్టబెట్టిన ఆప్ మంత్రి... విమర్శలకు జడిసి రాజీనామా!


సౌమ్యా జైన్... ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కుమార్తె. స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన ఈమెను, ఆరోగ్య శాఖ ప్రారంభించిన మోహల్లా ప్రాజెక్టు (పేదలకు వైద్య సేవలందించేలా, ఇరుగు పొరుగునే చిన్న చిన్న క్లినిక్ లను ఏర్పాటు చేయడం)కు హెడ్ గా నియమించి, కుమార్తెపై తన ప్రేమను చాటుకున్నారు సత్యేందర్. ఆపై ప్రజారోగ్యంపై ఎలాంటి అనుభవం, అర్హతలూ లేని సౌమ్యను ఎలా ఈ పదవికి నియమిస్తారని విపక్షాలు, విద్యాధికుల నుంచి తీవ్ర విమర్శలు రాగా, ఈ ఉదయం తన పదవికి సౌమ్య రాజీనామా చేశారు. అంతకుముందు "కేజ్రీవాల్ నిజస్వరూపం ఇదే. ఆప్ కార్యకర్తలకు, మంత్రుల బంధుగణానికి ముఖ్యమైన బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జరిగింది. అనర్హులను అందలమెక్కిస్తున్నారు" అని బీజేపీ నేత హరీశ్ ఖురానా విమర్శించారు. కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ సైతం, సౌమ్య నియామకం చట్ట విరుద్ధమని ఆరోపించారు. తన తండ్రికి రిపోర్టు చేసే ఆరోగ్య శాఖ కార్యదర్శికి సౌమ్య రిపోర్టు చేయాల్సి వుంటుందని, ఎలాంటి వైద్యానుభవం లేని ఆమె ఏం సేవలు చేస్తుందని ప్రశ్నించారు. మొత్తానికి సౌమ్య రాజీనామాతో ఈ వివాదం సద్దుమణిగినట్టే.

  • Loading...

More Telugu News