: సూడాన్ లో అంతర్యుద్ధం!.... భారతీయులను రప్పించేందుకు ‘సంకట్ మోచన్’!
సుడాన్ లోని దక్షిణ ప్రాంతంలో మొదలైన అంతర్యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో అక్కడ పెచ్చరిల్లిన అల్లర్లలో ఇప్పటికే 300 మందికి పైగా చనిపోయారు. అయితే వివిధ పనుల నిమిత్తం సూడాన్ వెళ్లిన దాదాపు 600 మంది భారతీయులు సూడాన్ లో చిక్కుకుపోయారు. వీరందరినీ సురక్షితంగా దేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ‘సంకట్ మోచన్’ పేరిట ప్రత్యేక ఆపరేషన్ కు తెర తీసిన విదేశాంగ శాఖ భారతీయులను తీసుకువచ్చేందుకు రెండు సీ-17 విమానాలను సూడాన్ రాజధాని జుబాకు పంపింది. ఈ మొత్తం ఆపరేషన్ ను విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.