: యూపీలో కాంగ్రెస్ చీఫ్ లు వస్తుంటారు, పోతుంటారు: కేంద్ర మంత్రి కృష్ణారాజ్‌


ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్‌ చీఫ్‌ లు వస్తుంటారు, పోతుంటారు, కానీ కాంగ్రెస్‌ మాత్రం అధికారంలోకి రాదని కేంద్ర మంత్రి కృష్ణారాజ్‌ ఎద్దేవా చేశారు. లఖింపూర్ ఖేరీలో ఆమె మాట్లాడుతూ, 2017లో యూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదేనని అన్నారు. 2017 తరువాత ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారం ఏర్పాటు చేస్తుందని ఆమె జోస్యం చెప్పారు. సమాజ్‌ వాదీ పార్టీ ఓటమి ఖాయమని చెప్పిన ఆమె, యూపీని ఎస్పీ అభివృద్ధి చేయలేదని అన్నారు. దీంతో యూపీ ప్రజలంతా బీజేపీ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News