: ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ సామాజిక కార్యకర్త, బెంగాలీ నవలా రచయిత్రి మహాశ్వేతాదేవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వయసు పైబడటంతో అనారోగ్యం పాలైన ఆమె సుమారు నెలన్నర రోజులుగా కోల్ కతాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమించినట్లు వైద్యులు ఈరోజు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆమె చికిత్సకు కొద్దిగా స్పందిస్తున్నారని చెప్పారు. కాగా, తన అద్భుతమైన రచనలకు గాను జ్ఞానపీఠ్, పద్మవిభూషణ్, రామన్ మెగసేసే అవార్డులు ఆమెను వరించాయి. హజార్ చౌరాసీ మా, రుడాలి, అగ్ని గర్భ, ధౌళి మొదలైన అద్భుత రచనలు ఆమె కలం నుంచి వెలువడ్డాయి. అంతేకాకుండా, ఆమె చేసిన పలు రచనలను సినిమాలుగా కూడా తెరకెక్కించారు.