: ఎంత టాలెంట్ ఉన్నా సినీ రంగంలో అదృష్టమనేది చాలా ముఖ్యం: నటుడు కోట శంకరరావు
మనలో ఎంత టాలెంట్ ఉన్నా సినీ రంగంలో అదృష్టమనేది చాలా ముఖ్యమని ప్రముఖ నటుడు కోట శంకరరావు అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘అదృష్టముంటే నటన లేకపోయినా నటుడవుతారు. అంతమాత్రం చేత నటననేది లేకుండా వెళ్లకూడదు. నటన అనేది ఒక ఆయుధం, ఏకే 47 లాంటిది... నటించే అవకాశమొస్తే ఒక దున్ను దున్నుదామని ఉండాలి. ఒక్కోసారి కలిసొస్తుంది, ఒక్కోసారి రాదు. అంతేతప్పా, వాళ్ల కన్నా నేనే గొప్ప నటుడిని... నా కన్నా వాళ్లు గొప్ప నటులు కాదు అనే భావం మన మనసులో అసలు ఉండకూడదు. ఈ పాత్రనైనా కాన్ఫిడెన్స్ తో నటించాలి’ అన్నారు కోట శంకరరావు.