: ఆ పదం ఎందుకు వాడారో కేజ్రీవాల్ వివరించాలి: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీలోని ఒక పోలీసు కానిస్టేబుల్ ని ‘తుల్లా’ అంటూ ఎందుకు అన్నారో చెప్పాలని సీఎం కేజ్రీవాల్ ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా, కానిస్టేబుల్ అజయ్ కుమార్ తనేజాపై ఈ పదాన్ని ప్రయోగించిన కేజ్రీపై సదరు కానిస్టేబుల్ దిగువ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కేజ్రీవాల్ కు దిగువ కోర్టు సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కానీ, ‘తుల్లా’ అనే పదానికి అర్థం ఏమిటో తదుపరి విచారణ రోజున వివరించాలని హైకోర్టు ఆదేశించింది.