: తెలంగాణ 'ఎంసెట్ 2' ఫలితాలు విడుదల
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 మెడికల్ ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి విడుదల చేశారు. హైదరాబాదులో విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన ఎంసెట్ ఫలితాలను వెల్లడించారు. ఈ పరీక్షకు 50,961 మంది హాజరుకాగా, అందులో 47,644 మంది ఫలితం సాధించారని ఆయన చెప్పారు. 21వ తేదీ తరువాత ర్యాంకు కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈనెల 25 నుంచి 29 వరకు సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని, ఆగస్టు మొదటి వారంలో కౌన్సిలింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. కాగా, ఈ పరీక్షలో ఫస్ట్ ర్యాంకు ఉజ్వల్ (హైదరాబాదు), సెకెండ్ ర్యాంకు ఐశ్వర్య (మెదక్), మూడో ర్యాంకు సాయి సుశృత (కర్నూలు), నాలుగో ర్యాంక్ వేణుమాధవ్ (హైదరాబాదు), ఐదో ర్యాంకు అంకిత్ రెడ్డి (హైదరాబాదు), ఆరో ర్యాంకు ప్రణవి (మహబూబ్ నగర్) ఏడో ర్యాంకు తేజస్విని (అనంతపురం), ఎనిమిదో ర్యాంకు సిద్ధార్థ్ (హైదరాబాదు) తొమ్మిదో ర్యాంకు వినీత్ (హైదరాబాదు) పదో ర్యాంకు కృష్ణ గీత్ (ఖమ్మం) సొంతం చేసుకున్నారు.