: సుష్మా స్వరాజ్ పెళ్లినాటి ఫోటోకు నెటిజన్ల లైక్స్!


కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె పెళ్లి నాటి ఫోటోను పోస్టు చేశారు. సాధారణంగా సుష్మా స్వరాజ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాతి ఫోటోలను అమితంగా వీక్షించిన నెటిజన్లు... పెళ్లి నాటి ఫోటోను ఆసక్తిగా చూస్తున్నారు. వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆమె ధన్యవాదాలు చెప్పారు. కాగా, సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌషల్. 1998-2004 కాలంలో పార్లమెంటు సభ్యుడిగా సేవలందించిన స్వరాజ్, అనంతరం మిజోరాం గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News