: చెట్లను నరికేసి మొక్కలు నాటడమేంటి?: హైకోర్టు విస్మయం


హైదరాబాదులోని కేబీఆర్ పార్క్ లో చెట్ల నరికివేతపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై విస్మయం వ్యక్తం చేసింది. అడవులు తరిగిపోయాయంటూ హరితహారం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని చెబుతున్న ప్రభుత్వం... అభివృద్ధి పేరిట చెట్లను నరికేయడమేంటని ప్రశ్నించింది. దశాబ్దాల నాటి చెట్లు నేలకొరుగుతుండడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చెట్లను నరకకుండా చేపట్టాల్సిన చర్యలపై పిటిషనర్ ను వివరణ అడిగింది. దీనిపై విచారణను కోర్టు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News