: పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కుకునూరుపల్లిలో పోలవరం నిర్వాసితులు ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా నాశనం చేస్తున్నారని, ఏ విషయం గురించైనా ప్రశ్నిస్తే తనపై బురదజల్లుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఈ ప్రాజెక్టుతో మేలు జరుగుతుందని, ఇటువంటి ప్రాజెక్టును ఎవరూ వ్యతిరేకించరని అన్నారు. ‘పట్టిసీమ’ నిర్వాసితులకు ఇచ్చిన విధంగానే ‘పోలవరం’ నిర్వాసితులకూ పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడి రెండేళ్ల పాలనలో ప్రతిదానికి టెంపరరీ బిల్డింగ్ లు నిర్మిస్తానంటారని, టెంపరరీ సెక్రటేరియట్, టెంపరరీ ఇల్లు అంటారని విమర్శించారు. హైదరాబాద్ లో, విజయవాడలో చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఇళ్లు, ఆఫీసుల మరమ్మతులకు కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేశారని జగన్ విమర్శించారు.

  • Loading...

More Telugu News