: భార్య సౌదీ వెళ్తాననడంతో భర్త ఆత్మహత్యాయత్నం
ఎంత చెప్పినా తన మాట వినకుండా సౌదీ అరేబియా వెళ్తానన్న భార్య తీరుతో విసిగిపోయిన ఒక భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. కడప జిల్లా కమలాపుంలో బాబా సాహెబ్ అనే వ్యక్తి ఈ రోజు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. సౌదీ అరేబియా వెళ్లొద్దని తన భార్యకు ఎన్నిసార్లు చెప్పినా, ఆమె మొండిపట్టు వీడకపోవడంతో మనస్తాపం చెందిన బాబా సాహెబ్ రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో, స్థానికులు ఆయన్ని రైలు పట్టాలపై నుంచి తప్పించేందుకు విఫలయత్నం చేశారు. అతను వినిపించుకోకపోవడంతో, ఆ రైల్ ట్రాక్ పైకి వస్తున్న రైలును స్థానికులు ఆపివేయడంతో ప్రమాదం తప్పింది.