: గోద్రా అల్లర్లకు ‘నిప్పు’ రాజేసిన నిందితుడి అరెస్ట్!... మాలేగావ్ లో పట్టేసిన పోలీసులు


గుజరాత్ లోని గోద్రాలో 2002లో రైలుకు నిప్పు పెట్టిన ఘటనలో 59 మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన కీలక నిందితుడు ఇమ్రాన్ బతూక్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అహ్మదాబాదు క్రైం బ్రాంచ్, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) జరిపిన సంయుక్త ఆపరేషన్ లో భాగంగా మహారాష్ట్రలోని మాలేగావ్ లో అతడు పట్టుబడ్డాడు. ఈ కేసులో కిరోసిన్ డబ్బా చేతబట్టుకుని రైలెక్కి ఎస్-6 బోగీకి నిప్పు పెట్టిన మరో నిందితుడు ఫరూక్ మొహ్మద్ గతంలోనే అరెస్టైన సంగతి తెలిసిందే. గోద్రాలో పెచ్చరిల్లిన అల్లర్లకు ఈ ఘటనే ఆజ్యం పోసింది. రైలుకు నిప్పు పెట్టడంతోనే ఓ వర్గానికి చెందిన వారు గోద్రాలో స్వైర విహారం చేశారు. ఈ అల్లర్లలో దాదాపు 1,000 మంది దాకా చనిపోయారు.

  • Loading...

More Telugu News