: వరంగల్ కలెక్టర్ చాంబర్ జప్తునకు ఆదేశాలు!... స్పోకెన్ ఇంగ్లీషు ఫీజు చెల్లించకపోవడమే కారణం!


వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్ జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ ప్రైవేటు సంస్థ వేసిన వ్యాజ్యాన్ని విచారించిన వరంగల్ జిల్లా కోర్టు ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బందికి స్పోకెన్ ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వాలని 2010లో అప్పటి కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు పిలిచిన టెండర్లలో బిడ్ దాఖలు చేసిన ‘ఎల్ట’ స్సోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చే పనిని దక్కించుకుంది. అనుకున్న మేరకు రెవెన్యూ సిబ్బందికి ఆ సంస్థ శిక్షణ ఇచ్చింది. అయితే అందుకు సంబంధించిన బిల్లుల్లో కొంతమేర విడుదలైనా... ఇంకా రూ.1.5 లక్షల బిల్లు పెండింగ్ ఉంది. ఈ బిల్లు కోసం ఆ సంస్థ ఎన్నిసార్లు తిరిగినా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పందన రాలేదు. దీంతో కోర్టుకెక్కిన ఆ సంస్థ బకాయిలు ఇప్పించాలని కోరింది. కోర్టు విచారణలోనూ కలెక్టరేట్ అధికారులు సరిగా స్పందించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చాంబర్ ను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News