: ఎంత చెప్పినా చంద్రబాబుకు అర్థం కావడం లేదు: జగన్ నిప్పులు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రజల కష్టాల గురించి ఎంత చెప్పినా అర్థం కావడం లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో సమావేశమైన జగన్, వారిని ఉద్దేశించి ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఆవగింజంతైనా ప్రయత్నించడం లేదని మండిపడ్డారు. బాబు పాలనలో రైతుల జీవితాలు గంగపాలవుతున్నాయని విమర్శించారు. ఏడాది నుంచి తమకు న్యాయం జరగాలని పొగాకు రైతులు కోరుకుంటున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరుకుంటున్నానని అన్నారు. డబ్బులు లేవని చెబుతూ, నెలకు రెండుసార్లు విదేశాలకు వెళ్లి వస్తున్న చంద్రబాబును ఏమనాలని జగన్ ప్రశ్నించారు. ప్రైవేటు విమానం ఎక్కి షికార్లకు పోతున్నారని ఎద్దేవా చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా తాను ప్రజల ముందుకు వచ్చానని అన్నారు. రుణాల మాఫీ అని అందరినీ మోసం చేశారని ఆరోపించారు. తక్షణం పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలని జగన్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News