: ఆగిన పాపికొండల విహార యాత్ర... కంట్రోల్ రూముల నంబర్లివే!


ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీ స్థాయిలో వరదనీరు వస్తుండటంతో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినప్పటికీ, ఆ తరువాత ఉపనదుల నుంచి నీరు వచ్చి కలుస్తుండటంతో, కిన్నెరసాని ప్రాంతం నుంచి పట్టిసీమ, ధవళేశ్వరం వరకూ నీటి ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. విహార యాత్రతో పాటు లంక గ్రామాలన్నింటికీ పడవలను ఆపేశారు. ఈ వరదతో పోలవరం నిర్మాణ పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వరద నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూములను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఏవైనా సమస్యలు వస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. జంగారెడ్డి గూడెంలో 08821 223660, పోలవరంలో 08811 251048, కుక్కునూరులో 94923 62623, వేలేరుపాడులో 94923 60603 నంబర్లు వినియోగించుకోవాలని తెలిపారు. ఇబ్బందులు ఎదురైతే, అన్ని రకాలుగా సాయపడేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News