: రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రైవేటు బిల్లు పెట్టిన వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 361బీ, పదవ షెడ్యూల్ కు చట్ట సవరణ కోరుతూ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కాపీని రాజ్యసభ కార్యదర్శికి పంపుతూ, త్వరలో జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. కాగా, తమ బాధ్యతలు, విధుల నిర్వహణ వల్ల ఏదైనా హాని జరిగితే, అందుకు రాష్ట్రపతి, గవర్నర్ లు కోర్టుల్లో జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఆర్టికల్ 361 చెబుతోంది. వారి అధికారిక పదవీ కాలంలో ఎలాంటి కేసులూ పెట్టే వీలు లేదని 361బీ వివరిస్తుండగా, దీనితో పాటు టెన్త్ షెడ్యూల్ కు సైతం మార్పులు చేయాలని, తన ప్రతిపాదనలకు సంబంధించిన కాపీని జతపరిచానని విజయసాయిరెడ్డి తెలిపారు.