: శిద్ధా శాఖల తరలింపులో వాయిదాల పర్వం!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆధ్వర్యంలోని ప్రభుత్వ శాఖల తరలింపులో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రవాణా శాఖతో పాటు రోడ్లు, భవనాల శాఖలు సిద్ధా చేతిలో ఉన్నాయి. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడిలో కొత్తగా నిర్మితమవుతున్న తాత్కాలిక సచివాలయంలోకి ఇప్పటికే చాలా శాఖలు మారిపోయాయి. అయితే రవాణా, రోడ్లు, భవనాల శాఖల తరలింపు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికి ఈ నెల 5ననే ఈ రెండు శాఖలు వెలగపూడికి తరలాల్సి ఉంది. ఈ మేరకు అప్పటికే నిర్ణయం తీసుకున్న శిద్ధా రాఘవరావు అనివార్య కారణాల వల్ల ఈ నెల 11వ తేదీకి, ఆ తర్వాత 13 వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 21కి తన శాఖల తరలింపును వాయిదా వేస్తూ నిన్న శిద్ధా కీలక నిర్ణయం తీసుకున్నారు.