: రాణి వద్దకు బ్రిటన్ ప్రధాని... రాజీనామా సమర్పించేందుకే!
యూకేలో 'బ్రెగ్జిట్' తీర్పు అనంతరం, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓటమిపాలైన ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ కు మరికాసేపట్లో తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఆపై థెరిస్సా మే, దాదాపు మూడు దశాబ్దాల అనంతరం బ్రిటన్ కు మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1980వ దశకంలో మార్గరెట్ థాచర్ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆపై మరే మహిళా ఆ పదవిని అలంకరించలేదు. నిన్న కామెరూన్ నేతృత్వంలో చివరి మంత్రివర్గ సమావేశం జరుగగా, ఆయన సేవలను మంత్రులంతా కొనియాడారు. ఇన్నాళ్లూ దేశానికి సేవ చేసే అవకాశం లభించడం గర్వకారణమని, మంత్రివర్గాన్ని నడిపించడం తన జీవితంలో లభించిన గొప్ప అవకాశమని అన్నారు.