: అర్ధరాత్రి రోడ్డెక్కిన కేటీఆర్!... ఉరుకులు పరుగులు పెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు!


టీఆర్ఎస్ యువ నేత, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అత్యంత కీలక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పనితీరులో తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. పురపాలక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మరింత మేర కష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిన్న అర్ధరాత్రి ఆయన రోడ్డు మీదకొచ్చారు. కూకట్ పల్లి పరిధిలో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించారు. సాక్షాత్తు కేటీఆర్ రోడ్డు పనుల పర్యవేక్షణకు అర్ధరాత్రి బయలుదేరి రావడంతో జీహెచ్ఎంసీ అధికారులు హైరానా పడ్డారు. అప్పటికప్పుడు అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టారు. ఇవేమీ పట్టించుకోని కేటీఆర్... పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస బాధ్యతలను విస్మరించిన కింది స్థాయి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీదకు వచ్చిన కేటీఆర్ చాలా సేపు పనులను పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News