: కేంద్ర మంత్రి పదవులకు నజ్మా హెప్తుల్లా, జీఎం సిద్దేశ్వర రాజీనామాలు


కేంద్ర మంత్రులు నజ్మా హెప్తుల్లా, సహాయమంత్రి జీఎం సిద్దేశ్వర తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. నజ్మాహెప్తుల్లా నిర్వహించిన మైనార్టీ వ్యవహారాల శాఖను ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి, సిద్దేశ్వర్ నిర్వహించిన భారీ పరిశ్రమల సహాయ శాఖను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోకు అప్పగించారు. అయితే, బాబుల్ సుప్రియోను అంతకు ముందు నిర్వహించిన పట్టణాభివృద్ధి, హౌసింగ్, శాఖల నుంచి భారీ పరిశ్రమల శాఖకు మార్చడం గమనార్హం. కాగా, నజ్మా హెప్తుల్లాను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని, 75 ఏళ్లు దాటిన నజ్మాపై కచ్చితంగా వేటుపడుతుందని మొన్నటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జోరుగా ప్రచారం సాగింది.

  • Loading...

More Telugu News