: కేపీహెచ్ బీ కాలనీ గ్రీన్ స్పా మసాజ్ సెంటర్ లో వ్యభిచారం... నలుగురు అరెస్టు


హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లలో ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రీన్ స్పా మసాజ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యభిచారం చేస్తున్న నలుగురు మహిళలతో పాటు సహ నిర్వాహకుడు విజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.6,360 నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News