: ‘గ్యాంగ్ లీడర్’లోని మెగాస్టార్ ను చిన్నప్పుడు ఇమిటేట్ చేశా: హీరో వరుణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవిని తన చిన్న వయస్సులోనే అనుకరించే ప్రయత్నం చేశానని యువహీరో వరుణ్ తేజ్ అన్నాడు. మెగాస్టార్ సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘గ్యాంగ్ లీడర్’లో చిరంజీవి స్టైల్ ను తాను చిన్నవయస్సులోనే ఇమిటేట్ చేసేందుకు ప్రయత్నించానని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పాడు. ఈ ట్వీట్ తో పాటు తన చిన్నప్పటి ఫొటోను వరుణ్ పోస్ట్ చేశాడు. కాగా, ఇరవై ఐదేళ్ల క్రితం విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతి నటించింది. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు కురిపించింది. హాస్యనటుడు అల్లురామలింగయ్య, రావుగోపాలరావు, మురళీమోహన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.