: అల్లు అర్జున్ చెప్పిన ఆ మాటలు మర్చిపోలేను: హీరో నిఖిల్
'హీరో అవ్వాలంటే' అనే దానిపై ఒకసారి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటలని తాను ఎప్పటికీ మర్చిపోలేనని.. తనకు ఇంకా గుర్తున్నాయని హీరో నిఖిల్ అన్నాడు. ‘హీరో అవడమంటే మాటలు కాదు.. చిన్న విషయం కాదు. హీరో అవడం గురించి ఒకసారి బన్నీ నాతో అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. ‘ఎన్నో కోట్లసార్లు దేవుడికి అభిషేకాలు చేస్తేనే, గుడులు కడితేనో ఈ జన్మలో మనం హీరో అవుతాం’ అని బన్నీ అన్నాడు. అంత లక్కును పోగొట్టుకోవాలని నాకు లేదు. నా డెడికేషన్ పూర్తిగా సినిమాలపైనే ఉంటుంది’ అని నిఖిల్ చెప్పాడు.