: బెనారస్ చీర కోసం గొడవ... మగపెళ్లివారిని గదిలో బంధించిన వధువు కుటుంబసభ్యులు
కట్న కానుకల కోసమో, లాంఛనాల కోసమో పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయిన సంఘటనల గురించి విన్నాము. అయితే, ఒక చీర కోసం పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పే ఆశ్చర్యకర సంఘటనలు కూడా ఉంటాయనడానికి బీహార్ లోని చంపారన్ జిల్లాయే నిదర్శనం. ఈ జిల్లాకు చెందిన అమ్మాయి, అబ్బాయికి మరి కొద్ది సేపట్లో పెళ్లి జరుగుతుందనగా అసలు గొడవ మొదలైంది. వధువుకి మగపెళ్లివాళ్లు బెనారస్ చీరపెట్టలేదంటూ వధువు, ఆమె కుటుంబసభ్యులు అడగడంతో గొడవ మొదలైంది. రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. చివరకు మగపెళ్లి వారిని, వారి బంధువులను ఒక గదిలో పెట్టి వధువు తరపువారు బంధించారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకుని మగపెళ్లి వారిని గదిలో నుంచి బయటకు రప్పించారు. ఆ తర్వాత వధువు, వరుడు తరపు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అయితే, రెండు రోజుల తర్వాత వారి వివాహం జరిగింది.