: మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిపై కత్తితో దాడి చేసిన కొడుకు


అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే మద్రాసు హైకోర్టులో దారుణం చోటుచేసుకుంది. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పని చేసే మణిమారన్ తో అతని కుమారుడికి విభేదాలు తలెత్తాయి. గత కొంత కాలంగా వారి మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్రాసు హైకోర్టులో కత్తితో ప్రవేశించిన మణిమారన్ కుమారుడు, తండ్రి ఛాంబర్ నుంచి బయటకు రాగానే స్నేహితులతో కలిసి అతనిపై కత్తులతో దాడికి దిగాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు మణిమారన్ కుమారుడ్ని అదుపులోకి తీసుకుని, మణిమారన్ ను ఆసుపత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలపాలైన మణిమారన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News