: విండీస్ బ్యాట్స్ మన్ లెండిల్ సిమ్మన్స్ సాహసం... సింగిల్ ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్


వెస్టిండీస్ బ్యాట్స్ మన్ లెండిల్ సిమ్మన్స్ సాహసం చేశాడు. గల్లీక్రికెట్ లో నిత్యం కనిపించే ఫీట్ ను లెండిల్ సిమ్మన్స్ అంతర్జాతీయ క్రికెట్ లో ప్రదర్శించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో అమేజాన్ వారియర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ పాట్రియట్స్ తరపున బరిలోకి దిగిన సిమన్స్ సింగిల్ ప్యాడ్ కట్టుకుని బరిలో దిగాడు. ఒక విధంగా ఇది రిస్క్ తో కూడినది. ప్యాడ్ లేని కాలుకి పొరపాటున బాల్ తగిలిందంటే కెరీర్ కే ప్రమాదం రావచ్చు. అయితే, ఇవేవీ పట్టించుకోని సిమ్మన్స్ సింగిల్ ప్యాడ్ తో బరిలో దిగి అర్ధసెంచరీ కొట్టడం విశేషం. అయితే సిమ్మన్స్ సాధించిన అర్ధ సెంచరీ టీ20 చరిత్రలో అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీగా చరిత్రలో నిలిచిపోనుంది. సిమ్మన్స్ అర్ధ సెంచరీ సాధించేందుకు 60 బంతులు తీసుకోవడం విశేషం. ఇలా ఒక్క ప్యాడ్ కట్టుకుని బ్యాటింగ్ చేయడాన్ని తానెక్కడా చూళ్లేదని కామెంటేటర్ ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించడం విశేషం.

  • Loading...

More Telugu News