: నవ్యాంధ్రలో కొత్త రైలును ప్రారంభించిన సురేష్ ప్రభు... ఆగే స్టేషన్లు, సమయాలు!


రాయలసీమ ప్రాంతాన్ని అమరావతికి కలుపుతూ కొత్త రైలు నేడు ప్రారంభమైంది. విజయవాడ, ధర్మవరం మధ్య వారంలో మూడు రోజులు నడిచే రైలుకు, న్యూఢిల్లీ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు రిమోట్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా హాజరయ్యారు. ఇక నంబర్ 17215గా విజయవాడలో సోమ, బుధ, శనివారాల్లో రాత్రి 11:10కి కదిలే రైలు గుంటూరు నుంచి 11:55కు, నరసరావుపేట నుంచి అర్ధరాత్రి 12:44కు, వినుకొండ నుంచి 1:19కి, మార్కాపూర్ రోడ్ నుంచి 2:36కు, గిద్దలూరు నుంచి తెల్లవారుఝామున 3:46కు, నంద్యాల నుంచి 5:30కి, డోన్ నుంచి ఉదయం 7:10కి, గుత్తి నుంచి 8:17కు, అనంతపురం నుంచి 9:27కు బయలుదేరి ధర్మవరానికి 10:45కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 17216 నంబరుతో మంగళ, గురు, ఆదివారాల్లో సాయంత్రం 5:50కి ధర్మవరంలో బయలుదేరి, అనంతపురంకు 6:32కు, గుత్తిలో 7:52కు, డోన్ లో 9:20కి, నంద్యాలలో అర్ధరాత్రి 12:10కి, గిద్దలూరులో 1:51కి, మార్కాపూర్ రోడ్ లో 2:51కి, వినుకొండలో 3:42కు, నరసరావుపేటలో తెల్లవారుఝామున 4:15కు, గుంటూరులో 5:40కి కదిలి విజయవాడకు ఉదయం 6:50కి చేరుతుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News