: ‘నీట్’ నిర్వహణ కేసు విచారణను బదిలీ చేసిన సుప్రీంకోర్టు


నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్) నిర్వహణ కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అనిల్ ఆర్.దవే, జస్టిస్ గోయల్ తో కూడిన ధర్మాసనానికి ఈ కేసు విచారణను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నీట్ నిర్వహణపై కేసును జస్టిస్ దవే, జస్టిస్ గోయల్ ధర్మాసనం విచారించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News