: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని మోదీ సూచించారు: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ కాల్చివేత కారణంగా కాశ్మీర్‌లో చెలరేగుతోన్న ఆందోళనలను అదుపుచేసి అక్కడ ప్రశాంత వాతావారణాన్ని నెలకొల్పేలా చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించినట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో చెలరేగుతోన్న అల్లర్లపై ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ... ఆందోళనల కారణంగా కాశ్మీర్‌లో అమాయకులెవరికీ హాని జరగకుండా చూడాలని ప్రధాని సూచించినట్లు పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి సాయం అందించడానికి కృషి చేయాలని తెలిపినట్లు ఆయన చెప్పారు. ఆందోళనల కారణంగా సుడాన్‌లో చిక్కుకున్న వారి గురించి కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి మోదీ చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.