: ఐసిస్ సానుభూతిపరులు పేర్లు మార్చుకొని ఆన్‌లైన్‌లో సంభాషించారు: ఎన్ఐఏ
హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరిపిన సోదాల్లో ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు ఈ ఐదుగురిని 12 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఈరోజు నాంపల్లి కోర్టులో వీరిని అధికారులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ వారినుంచి సేకరించిన పలు విషయాలను కోర్టుకి తెలిపింది. ఐసిస్ చీఫ్‌తో సానుభూతిపరులు మాట్లాడినట్లు తాము నిర్ధారించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఐసిస్ సానుభూతిపరులు పేర్లు మార్చుకొని ఆన్‌లైన్‌లో సంభాషించినట్లు తెలిపింది.