: భారత్ కు వ్యతిరేకంగా మరింత మంది బుర్హాన్ వనిలు!... తాజా వీడియోలో పేట్రేగిన హఫీజ్!


హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది ఎన్ కౌంటర్ తో జమ్ము కశ్మీర్ లో భారీ హింస చోటుచేసుకుంది. రోజుల తరబడి కొనసాగుతున్న అల్లర్లలో ఇప్పటికే సుమారు 30 మంది చనిపోయారు. వేలాది మంది జవాన్లు రంగంలోకి దిగినా ఇంకా అక్కడ పరిస్థితులు చల్లారలేదు. ఈ క్రమంలో బుర్హాన్ వనిని కీర్తిస్తూ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుర్హాన్ వని ఎన్ కౌంటర్ జరిగిన మరుక్షణమే ఓ వీడియో జమాత్ ఉద్ దవా ట్విట్టర్ ఖాతాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో హఫీజ్ మరోమారు పేట్రేగిపోయాడు. భారత్ పై వ్యతిరేకంగా పోరు సాగించేందుకు మరింత బుర్హాన్ వనిలు పుట్టుకొస్తారని హఫీజ్ ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. ‘‘భారత బలగాల చేతిలో డజన్ల కొద్దీ అమాయక కశ్మీరీలు చనిపోతున్నారు. వందలాది మంది గాయపడుతున్నారు. స్వాతంత్య్రం కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి దేవుడి దయ వల్ల త్వరలోనే ఫలితం వస్తుంది. మరింత మంది బుర్హాన్ వనిలు భారత్ కు వ్యతిరేకంగా పోరు సాగిస్తారు’’ అని హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News