: ఉగ్రవాదంపై ఉక్కుపాదమే!... కీలక మంత్రులతో భేటీలో మోదీ నిర్ణయం!


జమ్ము కశ్మీర్ లో చోటుచేసుకున్న అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికార నివాసం 7, రేస్ కోర్స్ రోడ్డులో నిర్వహించిన కీలక భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ భేటీకి హాజరయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాల్సిందేనని ఈ భేటీలో ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు, భద్రతా విభాగాలకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రికులకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కూడా మోదీ ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News