: ఏపీకి రెండో కొత్త రైలు నేడే ప్రారంభం!... ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించనున్న ప్రభు!
నవ్యాంధ్రకు కేంద్రం ప్రకటించిన రెండో కొత్త రైలు నేటి నుంచి ప్రారంభం కానుంది. విజయవాడ- ధర్మవరం మధ్య తిరిగే ఈ రైలు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మీదుగా ప్రయాణిస్తుంది. రాయలసీమ ప్రాంత వాసులకు రాజధాని ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ కొత్త రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇటీవలే ప్రకటించారు. నేడు ఢిల్లీ నుంచే ఆయన రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ కొత్త రైలును ప్రారంభించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు తిరిగే ఈ రైలు రాయలసీమ ప్రాంత ఉద్యోగులకు వరంగా మారుతుందని చెప్పచ్చు.