: నకిలీ ఎకౌంట్ల బాధితుల్లో కేంద్ర మంత్రి
రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తదితరులకు సంబంధించి సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించేవారికి కొదవలేదు. అయితే, ఈ నకిలీ ఖాతాల జాబితాలో సాక్షాత్తు కేంద్రమంత్రి కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. ఇంతకీ ఎవరా మహిళా మంత్రి అంటే, కేంద్ర మంత్రి వర్గంలో కొత్తగా స్థానం సంపాదించిన అప్నాదళ్ పార్టీ చీలికవర్గానికి చెందిన ఎంపీ అనుప్రియ పటేల్. ఆమె పేరుపై ఇటీవల ట్విట్టర్ లో నకిలీ ఖాతా తెరిచి, ఒక మతంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారని, చాలా తొందరగా ఈ విషయం తెలుసుకుని వెంటనే ఢిల్లీ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశానని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరానని అనుప్రియ చెప్పారు.