: ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వీళ్లందరికీ శిక్ష విధించాలి: కోమటిరెడ్డి


చిన్నారి రమ్య మృతి ఘటనపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాదులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దారుణమని అన్నారు. ఈ ఘటనలో ఇంకా దారుణం ఏంటంటే, ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తులకి స్టేషన్ బెయిల్ ఇవ్వడమని ఆయన పేర్కొన్నారు. పూటుగా తాగి మితిమీరిన వేగంతో ఇద్దరిని చంపేసిన యువకులు దోషులని తేలిన తరువాత వారికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. ఈ ఘటనలో కేవలం యువకులే నిందితులు కాదని, వారికి అలాంటి అలవాట్లు రావడానికి కారణమైన తల్లిదండ్రులు, వేళాపాళ లేకుండా... పెద్దలు, పిల్లలు అన్నది పట్టించుకోకుండా వ్యాపారం చేసుకునే మద్యం షాపుల వాళ్లు కూడా ఈ ఘటనలో దోషులేనని అన్నారు. వీరందరినీ శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, వీలైనంత త్వరగా శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఆయన కుమారుడు ప్రతీక్ రెడ్డి రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News