: చిన్నారి రమ్య కుటుంబసభ్యులను సీఎం వద్దకు తీసుకువెళతా: మంత్రి తలసాని


చిన్నారి రమ్య కుటుంబసభ్యులు కొద్దిగా కోలుకున్న తర్వాత వారిని సీఎం కేసీఆర్ వద్దకు తీసుకువెళతానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు. రమ్య కుటుంబసభ్యులు ఏమడిగినా సీఎంతో మాట్లాడిస్తానని చెప్పారు. రమ్య కేసులో నిందితుడికి పదేళ్ల శిక్ష పడే అవకాశాలున్నాయని, అదేవిధంగా మిగిలిన వాళ్లపై కూడా కేసు పెట్టే అవకాశాలున్నాయేమో తెలుసుకునేందుకు గాను లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని చెప్పారు. భారతదేశంలో హైదరాబాద్ పోలీస్ నంబర్ వన్ గా ఉన్నారని, డ్రంకెన్ డ్రైవ్ కేసులలో పెద్ద పెద్ద వాళ్లనే పట్టుకుంటున్నారన్నారు. 16, 17 సంవత్సరాల కుర్రాళ్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, ఈ విషయమై కూడా చర్యలు తీసుకునే విధంగా ఆలోచిస్తున్నామని తలసాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News