: కొన్ని అసాంఘిక శక్తులు కశ్మీర్ లో హింసను ప్రేరేపిస్తున్నాయి: వెంకయ్య
కశ్మీర్‌లో తీవ్రంగా చెలరేగుతోన్న అల్లర్లపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈరోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌లో ఉగ్రవాదిని హతమార్చిన కారణంగానే ఆందోళనకారులు రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు. కొన్ని అసాంఘిక శక్తులు హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్కడి అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన తెలిపారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగు యాత్రికులు పడుతోన్న అవస్థల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాము మాట్లాడామని వెంకయ్యనాయుడు చెప్పారు. వారిని సురక్షితంగా తమ స్వస్థలాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు.