: హార్దిక్ కు మరో రెండు కేసుల్లో బెయిల్ మంజూరు...రేపు జైలు నుంచి విడుదల
గుజరాత్ లో పటేళ్ల నాయకుడు హార్దిక్ పటేల్ కు మరో రెండు కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మూడు రోజుల క్రితం దేశద్రోహం కేసులో హార్దిక్ కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో, రేపు జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. బెయిలు మంజూరు చేస్తూ, గుజరాత్ నుంచి 6 నెలల పాటు హార్దిక్ రాష్ట్రం బయట వుండాలని కోర్టు షరతు విధించిన విషయం తెలిసిందే. కాగా, తొమ్మిది నెలల క్రితం హార్దిక్ మద్దతుదారులు గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. అధికార బీజేపీకి వ్యతిరేకంగా పటీదార్ వర్గాన్ని హార్దిక్ రెచ్చగొట్టాడని, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడని, పోలీసులను హతమార్చాలని యువతను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలపై హార్దిక్ పై పలు కేసులు నమోదు చేశారు.