: జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ ఫోన్ చేసిన 14 ఏళ్ల బాలుడు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ చెన్నై సిటీ పోలీస్ కంట్రోల్ రూంకి ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆగమేఘాల మీద జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ కు భద్రతను పెంచి, వచ్చిన కాల్ పై దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఫోన్ కాల్ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చినట్టు గుర్తించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు మరకణ్ణం చేరుకుని, ఆగంతకుడి కోసం గాలించారు. దీంతో ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తానని బెదిరించింది భువనేశ్వరన్ అనే 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. దీంతో బాలుడిన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాంబు బెదిరింపును మాత్రం తేలిగ్గా తీసుకోని అధికారులు పొయెస్ గార్డెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.