: కొనడానికని వచ్చారు... టెస్ట్ డ్రైవ్ అంటూ బైకేసుకుని వెళ్లిపోయారు!
దొంగలు చోరీకి నిత్యం సరికొత్త మార్గాలు వెతుక్కుంటూనే ఉన్నారు. తాజాగా ఆన్ లైన్ వ్యాపారం ఊపందుకుంది. దీంతో కొనుగోలుదారు, విక్రేతతో నేరుగా సంభాషించగలుగుతున్నాడు. దీనిని ఆసరాగా చేసుకున్న కొంతమంది మోసగాళ్లు చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. అన్వర్ అలీ ఆనే వ్యాపారి తన బైక్ ను ఆన్ లైన్ పోర్టల్ లో విక్రయానికి పెట్టాడు. దీనిని చూసిన ఇద్దరు యువకులు దానిని కొనుగోలు చేస్తామంటూ అతనిని సంప్రదించారు. బైక్ చూడాలనుకుంటున్నామని చెప్పడంతో ఉత్తమ్ నగర్ లో కలవాలని ఆయన వారికి సూచించాడు. దీంతో వారిద్దరూ నిర్ణయించుకున్నట్టు ఉత్తమ్ నగర్ లో కలిశారు. అనంతరం టెస్ట్ రైడ్ కు వెళ్తామంటూ వెళ్లిన యువకులు తిరిగివెనక్కి రాలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ఒకడిని పట్టేశాడు. అతడు ఢిల్లీ జలమండలి ఉద్యోగి కుమారుడిగా గుర్తించారు. పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం గాలిస్తున్నారు.