: మంచి మనసు చాటుకున్న ఖైదీలు... గార్డు కోసం జైలు తలుపులు బద్దలు కొట్టారు


కరుడుగట్టిన నేరస్తుల్లో కూడా మంచి మనసుంటుందని టెక్సాస్ లో చోటుచేసుకున్న ఘటన నిరూపించింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ నగరంలో కోర్టు భవనం జైలు గదిలో ఎనిమిది మంది ఖైదీలు చేతులకు బేడీలతో ఉన్నారు. గది బయట వారికి రక్షణగా ఓ గార్డు నిల్చున్నాడు. అంతవరకు వారితో సరదాగా మాట్లాడిన గార్డు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన ఖైదీలు ఏం చేయాలో పాలుపోక బయట ఉన్న వారికోసం గట్టిగా కేకలు వేశారు. ఫలితం లేకపోవడంతో వారంతా కలిసి గది తలుపులు పగులగొట్టి గార్డును చేరుకుని, మళ్లీ గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. వారి అరుపులు విన్న అధికారులు అక్కడికి చేరుకుని, అతనిని ఆసుపత్రిలో చేర్చారు. తొలుత ఖైదీలు చేసిన పనికి ఆశ్చర్యపోయినప్పటికీ, తరువాత వారిని అభినందించారు.

  • Loading...

More Telugu News