: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం పేర్కొంది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఒడిశా, జార్ఖండ్ మీదుగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, అలాగే మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.